ENGLISH

బ‌న్నీ కోసం ప‌ర‌శురామ్ స్కెచ్‌

21 August 2021-13:00 PM

అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి? అందుకే బ‌న్నీ కోసం క్యూ పెరుగుతూనే ఉంటుంది. బ‌న్నీ చేతిలో ఇప్పుడు బోల్డ‌న్ని సినిమాలున్నాయి. త‌న కోసం కొత్త క‌థ‌లూ రెడీ అవుతున్నాయి. ప‌ర‌శురామ్ కూడా బ‌న్నీ కోసం ఓ క‌థ త‌యారు చేశాడ‌ట‌. బ‌న్నీకి చెప్పి ఒప్పించాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు ప‌ర‌శురామ్.

 

గీతా ఆర్ట్స్ తో ప‌ర‌శురామ్‌కి మంచి అనుబంధం ఉంది. ఇప్ప‌టికే ఈ బ్యాన‌ర్‌లో రెండు సినిమాలు చేశాడు. గీత గోవిందం త‌ర‌వాత‌.. అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ అది వీలు కాలేదు. ఇప్పుడు మ‌హేష్ తో `స‌ర్కారు వారి పాట‌` పాడిస్తున్నాడు ప‌ర‌శురామ్. ఆ త‌ర‌వాత‌.. నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా ఉంటుంది. ఇవి రెండూ అయ్యాక‌.. బ‌న్నీతో ప‌ర‌శురామ్ ఓ సినిమా చేయ‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం అందుతోంది. స‌ర్కారు వారి పాట హిట్ట‌యితే క‌చ్చితంగా బ‌న్నీ నుంచి ప‌ర‌శురామ్ కి పిలుపు రావొచ్చు. నాగ‌చైత‌న్య సినిమా కంటే ముందు బ‌న్నీ సినిమా మొద‌ల‌వ్వొచ్చు. మొత్తానికి ఈ కాంబో సెట్స్ పైకి వెళ్ల‌డం మాత్రం ఖాయం.

ALSO READ: చిరు వీర‌య్య‌... భోళా శంక‌రుడా?!