సెకండ్ వేవ్ తరవాత... థియేటర్లు తెరచుకున్నప్పుడు తొలుత అడుగుపెట్టిన సినిమా `తిమ్మరుసు`. సత్యదేవ్ నటించిన చిత్రమిది. ఓ క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రానికి ఓమాదిరి రివ్యూలొచ్చాయి. వసూళ్లు కూడా అలానే ఉన్నాయి. ఈ సినిమా మొత్తానికి 2.2 కోట్లు సాధించింది. అయితే.. థియేటరికల్ రైట్స్‌రూపంలో.. 2.5 కోట్లకు ఈ సినిమా అమ్మేశారు. అద్దెలతో కలుపుకుంటే.. కనీసం 3 కోట్ల వరకూ రావాలి. అంటే.. బయ్యర్లకు 80 లక్షల వరకూ నష్టమన్నమాట.
అయితే నిర్మాతలు మంచి లాభాలు తెచ్చుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మంచి మొత్తమే వచ్చింది. ఎలా చూసుకున్నా.. తిమ్మరుసు టేబుల్ ప్రాఫిట్లతో బయటపడినట్టైంది. అయితే. థియేటర్ల నుంచి సరైన ఆదాయం రాలేదు. ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోకపోవడం, అక్కడ నైట్ షోలకు అనుమతి లేకపోవడంతో... తిమ్మరుసు నష్టాల పాలయ్యాడన్నది ట్రేడ్ వర్గాల టాక్.
ALSO READ: చిరు వీరయ్య... భోళా శంకరుడా?!