నేచురల్ స్టార్ నాని ప్రజంట్ సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మొదట అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేసి, అష్టా చెమ్మ సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమా సూపర్ హిట్ అవటంతో వెనక్కి తిరుగు చూసుకోలేదు. అప్పటి నుంచి వరుసగా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. నాని కెరియర్ లో సక్సెస్ రేటు కూడా ఎక్కువే ఉంది. నానితో మూవీ చేయటానికి నిర్మాతలు వెనకాడరు. హిట్ గ్యారంటీ. ఒక వేళ ఆలా జరగకపోయినా హిట్ తో సంబంధం లేకుండా పెట్టిన బడ్జెట్ వచ్చేస్తుంది అన్న ధీమా. దసరాతో సూపర్ హిట్ అందుకుని, తరవాత హాయ్ నాన్న సినిమాతో వచ్చి మరో హిట్ అందుకున్నాడు. హయ్ నాన్న సినిమాలో నాని యాక్టింగ్ స్కిల్స్ మరోసారి బయట పడ్డాయి.
వరుస విజయాలతో జోరు మీదున్న నాని నెక్స్ట్ సరిపోదా శనివారం చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మాణంలో వివేక్ ఆత్రేయ డైరక్ట్ చేస్తున్నాడు. సరిపోదా శనివారం మూవీ తరవాత నాని సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఇది నానికి 32 వ సినిమా. దీనికి డివివి దానయ్యే నిర్మాత. ఈ ఏడాది చివరికి సెట్స్ పైకివెళ్తున్న ఈ సినిమా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి, తనలో ఉన్న మాస్ ఎలిమెంట్ ని బయటికి తీసిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో ఇంకో సినిమా కమిట్ అయ్యాడు. ఈ మూవీ కూడా దసరా తరహాలోనే ఉంటుందని టాక్. నెక్స్ట్ బలగం వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఒక మూవీ రానుంది.
ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న నాని. వాటిని తొందర తొందరగా ముగించి ఏడాదికి రెండు సినిమాలతో వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడని టాక్. నాని ఒక్కో సినిమాకి 22 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ప్రజంట్ నాని చేతిలో సరిపోదా శనివారం కాకుండా నాలుగు సినిమాలున్నాయి. ఈ లెక్కన ఏడాదికి రెండు సినిమాలతో వస్తే నాని వార్షిక ఆదాయం ఇంచు మించు 50 కోట్లు. అది కేవలం సినిమాద్వారా సంపాదించేది మాత్రమే. మీడియం రేంజ్ హీరో ఈ లెవెల్లో సంపాదించటం గొప్ప విషయమే.