ENGLISH

సామ్ రీ ఎంట్రీ... అదిరిపోయేలా

02 April 2024-15:49 PM

ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత, ఆ మూవీలో జెస్సిగా నటించి అందరి మనసులు దోచుకుంది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి కెరియర్ లో వెను తిరిగి చూసుకోలేదు. నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా చేసింది. వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. మయా సైటీస్ కారణంగా వన్ ఇయర్ సినిమాలకి బ్రేక్  తీసుకుని, శారీరకంగా, మానసికంగా దృడంగా తయారయ్యింది. 


ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమై కథలు వింటోంది. వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం డబ్బింగ్ పూర్తి చేసింది సామ్. నెక్స్ట్ కోలీవుడ్ లో విజయ్ తో ఒక మూవీ కమిట్ అయ్యింది. కానీ తెలుగులో ఇప్పటివరకు సామ్ ఏ సినిమా కమిట్ అవలేదని ఆమె ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఇలాంటి క్రమంలో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పనుంది సామ్. పుష్ప 2 తరవాత బన్నీ అట్లీతో చేయబోయే సినిమాలో సామ్ నటించనున్నట్లు సమాచారం. 


పుష్ప మూవీతో నేషనల్ అవార్డు గెల్చుకున్న బన్నీ, నెక్స్ట్ పుష్ప 2 తో ఆగస్టు 15 న థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. ఈ మూవీ తరవాత బన్నీ, అట్లీ కాంబో పట్టాలెక్కనుంది. ఈ మూవీకి సామ్ ని ఫిక్స్ చేసారని టాక్. బన్నీ, సామ్ లది సూపర్ హిట్ జోడి వీరి కెమిస్ట్రీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. వీరి కాంబోలో వచ్చిన సన్ ఆఫ్ సత్య మూర్తి ఘనవిజయాన్ని సాధించిన  సంగతి తెలిసిందే. పుష్పలో వీరిద్దరూ కలిసి చేసిన సాంగ్ చాలా ట్రెండ్ అయ్యింది. పుష్ప 2  లో ఒక స్పెషల్ సాంగ్  చేయమని సామ్ ని సంప్రదిస్తే నో చెప్పింది. ఇప్పడు బన్నీతో నటించే ఛాన్స్ మళ్ళీ అందుకుంది. సామ్ కి ఇది అద్భుత మైన రీఎంట్రీ  అని ఫాన్స్ సంతోష పడుతున్నారు.