ENGLISH

సన్నీలియోన్‌.. బిగ్గెస్ట్‌ సెలబ్రిటీ!

05 November 2020-13:00 PM

సన్నీలియోన్‌.. ఈ పేరు తెలియనివారు ఎవరైనా వుంటారా.? ఛాన్సే లేదేమో.! ఎందుకంటే, సన్నీలియోన్‌ అంత పాపులర్‌ అయ్యింది మరి. పోర్న్‌ సినిమాల నుంచి, బాలీవుడ్‌ సినిమా వరకూ ఎదిగిన సన్నీలియోన్‌ వైనం చాలా చాలా ప్రత్యేకం. అసలామెను ఇండియాలోనే అడుగుపెట్టనివ్వబోమని అన్నారు చాలామంది. ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరిగాయి. కానీ, ఆ వ్యతిరేకతను తట్టుకుని సన్నీలియోన్‌ నిలబడింది. భారతీయ మూలాలున్న సన్నీలియోన్‌, భారతీయతను అందిపుచ్చుకుంది.. తన భారతీయతను చాటుకుంది.

 

ఇక, అసలు విషయమేంటంటే టాలీవుడ్‌ నటుడు నవదీప్‌, సన్నీలియోన్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. కమెడియన్‌ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టీవీ షోలో, సన్నీలియోన్‌ గురించి అడిగితే.. నవదీప్‌ చెప్పిన సమాధానం ‘నాకు తెలిసిన అతి పెద్ద సెలబ్రిటీ’ అని. జోవియల్‌గా అన్నాడా.? కావాలానే అన్నాడా.? వెటకారం చేశాడా.? అన్న విషయాల్ని పక్కన పెడితే, సన్నీలియోన్‌ విషయంలో నవదీప్‌ చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ మధ్య సన్నీలియోన్‌తో కలిసి స్క్రీన్‌ని షేర్‌ చేసుకున్నాడు ఆ మధ్య ఓ సందర్భంలో.

 

సినిమా కాదు లెండి.. ఓ డిజిటల్‌ ప్లాట్‌ఫాంకి సంబంధించిన వ్యవహారమది. అప్పట్లో సన్నీలియోన్‌ గ్రేట్‌నెస్‌కి నవదీప్‌ ఫిదా అయిపోతే, నవదీప్‌ని సైతం సన్నీలియోన్‌ పొగడ్తలతో ముంచెత్తేసింది. అదన్నమాట అసలు సంగతి.

ALSO READ: స‌త్య‌దేవ్ తో.. మేఘా ఆకాష్‌!