టెలివిజన్ రంగంలో అతి పెద్ద రియాలిటీ షో గా పేరు గాంచిన బిగ్ బాస్ కార్య క్రమం మొదట హిందీలో మొదలై తరవాత మిగతా భాషల్లో కూడా ప్రాచుర్యం పొందింది. తెలుగులో మా టీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ప్రస్తుతం హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి 7 సీజన్ లు పూర్తి చేసుకుంది. త్వరలో ఎనిమిదో సీజన్ రానుంది. దీనితో బిగ్ బాస్ హోస్ట్ పై పుకార్లు ప్రారంభం అయ్యాయి. షో మొదలయ్యే ముందు ప్రతీసారి నాగార్జున తప్పుకుంటున్నట్లు, హోస్ట్ గా కొత్తవారు వస్తున్నారని పలువురు పేర్లు వినిపించాయి. ఈ సారి కూడా హోస్ట్ మారనున్నాడని వార్తలు మొదలయ్యాయి. అయితే నాగ్ ప్లేస్ లో సీజన్ 7 కంటెస్టెంట్ హోస్ట్ గా రానున్నాడనీ తెలుస్తోంది.
సీజన్ 7 టాప్ 3 లో నిలిచిన హీరో శివాజీ ఇప్పుడు హోస్ట్ గా మారనున్నట్లు టాక్. నిజంగా శివాజీకి అంత సీన్ , క్రేజ్ ఉందా? నాగ్ లాంటి స్టార్ ని పక్కన పెట్టి శివాజీకి ఆఫర్ ఇస్తారా? అంటే నో అనే అనిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ షో బిగ్గెస్ట్ రియాలిటీ షో. అన్ని భాషల్లో ప్రసారం అవుతోంది. ఆయా భాషల్లో సూపర్ స్టార్స్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. హిందీ లో సల్మాన్. మలయాళం లో మోహన్ లాల్. తమిళంలో కమల్ హాసన్, కన్నడలో సుదీప్, తెలుగులో ఎన్టీఆర్, నానిల తరువాత నాగార్జున చేస్తున్నారు. వీరి క్రేజ్ కూడా షో కి ప్లస్ అయ్యింది.
అలాంటిది ఒక కంటెస్టెంట్ ని హోస్ట్ చేస్తారా? అని సందేహాలు మొదలయ్యాయి. ఈ వార్తల్లో నిజం లేదని కొందరు కొట్టి పడేస్తున్నారు. 'బిగ్ బాస్ బజ్' అనే సైడ్ ప్రోగ్రాం కి శివాజీ హోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. హౌస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్ లని ఇంటర్వ్యూ చేసే ప్రోగ్రాం కి బహుశా శివాజీ హోస్ట్ అయి ఉండొచ్చు అని. అదే విషయం తప్పుగా ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది.