టాలీవుడ్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అన్ని వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఏవి ఎప్పుడువస్తాయో తెలియటం లేదు. RRR తరవాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం 'గేమ్ చేంజెర్' రిలీజ్ ఎప్పుడో మేకర్స్ కి కూడా తెలియదు. అలాగే పుష్ప 2 కోసం ఫాన్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్ ఎట్టకేలకి ఆగస్టు 15 న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. హమ్మయ్య అనుకున్నారు సినీప్రియులు. కానీ ఇంతలోనే పుష్ప వెనక్కి వెళ్ళింది. కారణం షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవటమే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఐటెం సాంగ్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ మాటకి వస్తే ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ ఇంకా దొరకలేదు. సో ఈ కారణాల వలన పుష్ప డిసెంబర్ లో రావొచ్చని టాక్.
సమ్మర్ లో ఎప్పుడు పెద్ద హీరోలు వస్తారు. కానీ ఈ సారి ఎన్నికల హడావిడి, మరో పక్క ఐపీల్ సందడితో అంతా డ్రాప్ అయిపోయారు. అవన్నీ ముగియటంతో ఇక వరుసగా పెద్ద హీరోలు బరిలో దిగుతున్నారు. జూన్ 27 న కల్కి రిలీజ్ అవుతోంది. కల్కి మానియా తగ్గేసరికి ఇస్మార్ట్ వస్తున్నాడు. పుష్ప ఆగిపోవటంతో ఆ డేట్ కి ఇస్మార్ట్ రాబోతున్నాడు. పూరి జగన్నాథ్ , రామ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ అక్టోబర్ కి వస్తానన్న దేవర కూడా పుష్ప వాయిదా కారణంగా ముందే వస్తున్నాడు. సెప్టెంబర్ 27 న దేవర వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. అక్టోబర్ లో బాలయ్య, రవితేజ , నాని లాంటి స్టార్లు పోటీ పడుతున్నారు.
దీపావళికి 'కుబేర'. డిసెంబర్ కి గేమ్ చేంజర్ ఉండొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. బన్నీ పుష్ప మూవీ కూడా డిసెంబర్ లోనే రావచ్చు అని టాక్. ఇలా అయితే మెగా హీరోలు మధ్య మంచి పోటీ ఉంటుంది. అసలే మెగా ఫాన్స్, అల్లు ఫాన్స్ అని రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇప్పుడు సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అయితే ఇంకేం జరుగుతుందో చూడాలి.