ENGLISH

అఫీషియల్: డిసెంబర్ 6 నుంచి పుష్ప రూలింగ్

18 June 2024-13:22 PM

పుష్ప 2 వాయిదా పడింది. కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు నిర్మాతలు. తెలుగులో రానున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రాల్లో ఒకటి ‘పుష్ప ది రూల్‌’. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. 


అయితే అనుకున్న సమయానికి పనులు పూర్తి కావడం లేదు. దాదాపు ఇంకా యాభై రోజుల షూటింగ్ వుంది. దాని పోస్ట్ ప్రొడక్షన్ కలుపుకుంటే రిలీజ్ డేట్ ని అందుకోవడం కష్టం. దీంతో నిర్మాతలు సినిమాని వాయిదా వేశారు. డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు. 


సుకుమార్‌ - అల్లు అర్జున్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప ది రైజ్‌’ తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. 


ఎర్రచందనం అక్రమ రవాణాలో కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్‌.. ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో ‘పుష్ప ది రూల్’ వుంటుంది. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.