ENGLISH

మెగా మనసు చాటుకున్న సాయి తేజ్

18 June 2024-15:28 PM

మరొకసారి మెగా ఫాన్స్ మనసు దోచుకున్నాడు సాయి తేజ్. పవన్ క‌ళ్యాణ్ అంటే సాయి తేజ్ కి ప్రేత్యేక అభిమానం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయం పలుమార్లు సాయి తేజ్ కూడా చెప్పాడు. పవన్ కి కూడా మేనల్లుడు అంటే ప్రీతి. తన కెరియర్ నిలబెట్టాలని తనకోసం 'బ్రో' సినిమాలో కలిసి నటించాడు . తేజ్ ప్రతి కష్టంలోనూ అండగా ఉన్నాడు పవన్. మామ ఎన్నికల్లో గెలిస్తే ఆ విజయాన్ని తన విజయంగా సెలబ్రేట్ చేసుకున్నాడు సాయి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే పవన్ ని ఎత్తుకుని మరీ అభినదించాడు.    


గెలిచిన తరవాత మొదటిసారి పవన్, అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అప్పుడు సెలబ్రేషన్స్ లో సాయి తేజ్ చిన్న పిల్లాడిలా అల్లరి చేసాడు. ఇక ఇప్పుడు మావయ్య గెలిచినందుకు మొక్కులు తీర్చు కోవటానికి తిరుమల వెళ్ళాడు. తిరుపతి చేరుకొని అక్కడ నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా  కాలి నడకన తిరుమల చేరుకొని స్వామిని దర్శించుకుని మోకు చెల్లించుకున్నాడు. ఇది తెలిసిన మెగా ఫాన్స్ సాయి తేజ్ కి మావయ్య అంటే ఇంత ప్రాణమా ? అని మావయ్య అంటే అతనికున్న భక్తికి ఆశ్చర్య పోతున్నారు.