ENGLISH

ఆ హీరోయిన్‌కి అక్కడే బావుందట.!

27 April 2019-18:30 PM

ఎవరా హీరోయిన్‌,? ఏంటా కథ.? అనుకుంటున్నారా.? బుల్లితెరపై చిన్నారి పెళ్లికూతురు 'ఆనంది'గా ఇంటింటికీ, గడప గడపకీ సుపరిచితురాలు ముద్దుగుమ్మ అవికా గోర్‌. బుల్లితెరపై వచ్చిన పాపులారిటీతో పెద్ద స్క్రీన్‌పై సత్తా చాటాలని 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే ఆ సినిమాతో హిట్‌ కొట్టింది. ఆ తర్వాత అదే హీరో రాజ్‌తరుణ్‌తో 'సినిమా చూపిస్త మామా' అంటూ మరో హిట్‌నీ తన ఖాతాలో వేసుకుంది. 

 

కానీ ఆపై పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. తర్వాత బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకుంది. ఏవో అరా కొరా సినిమాలు చేసింది అక్కడ కూడా. పెద్దగా చెప్పుకోదగ్గవి కావవి. అయితే, సినిమాలకు ప్రమోట్‌ అయ్యాక తనకు ఫేమ్‌ తెచ్చిపెట్టిన బుల్లితెరను మాత్రం వదులుకోలేదు అవికాగోర్‌. ఇటు సినిమాల్లో అవకాశాలు వచ్చినా, రాకున్నా, బుల్లితెరపై ఈ భామ సందడి అలాగే ఉంది. బుల్లితెరపై వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. 

 

ఇప్పుడూ, ఎప్పుడూ బుల్లితెరను తాను వదిలిపెట్టననీ, అక్కడే తనకు కంఫర్ట్‌గా ఉందనీ చెబుతోంది అవికా గోర్‌. ఇదిలా ఉంటే, ఈ బుల్లితెర బ్యూటీ ఇప్పుడు హాట్‌ డోస్‌ కాస్త పెంచింది. సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతోంది. మంచి అవకాశాలు వస్తే, సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు పోషించడానికి కూడా తానెప్పుడూ సిద్ధమే అని సంకేతాలు పంపిస్తోంది అందాల అవికా.

ALSO READ: ఇంద్రగంటి కోసం ఈషా రెబ్బా.!