ENGLISH

పొట్టి నిక్కరుపై క్లారిటీ ఇచ్చిన జాన్వీ.!

27 April 2019-17:30 PM

అతిలోక సుందరి కూతురు జాన్వీకపూర్‌ డ్రస్సింగ్‌పై ఎప్పటికప్పుడే కామెంట్స్‌ వస్తుంటాయి. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆమె డ్రస్‌ సెన్స్‌పై తమకు నచ్చిన రీతిలో స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా జాన్వీ జిమ్‌ కాస్ట్యూమ్స్‌ ఎక్కువగా చర్చనీయాంశమవుతూ ఉంటాయి. జిమ్‌కెళ్లినప్పుడు స్కిన్‌ టైట్స్‌, పొట్టి నిక్కర్లు ధరించే జాన్వీకపూర్‌, తాజాగా ధరించిన జిమ్‌ వేర్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. 

 

మరీ పొట్టి నిక్కరులో జిమ్‌కి వెళ్తున్న జాన్వీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిజానికి జాన్వీ ఎక్కువగా పొట్టి నిక్కర్లలోనే జిమ్‌కి వెళుతుంటుంది. ఆమె జిమ్‌కి వెళ్లిన ప్రతీసారి ఆ పిక్స్‌ నెట్టింట్లో సెగలు పుట్టించడానికి ప్రత్యక్షమయిపోతాయి. అయితే తాజాగా జాన్వీ తన పొట్టి నిక్కరు విషయంపై నెటిజన్స్‌ని ఓ చిన్నపాటి క్లారిటీ అనలేం కానీ, క్లాస్‌ పీకింది. 

 

'నా డ్రస్సు నా ఇష్టం..' చెప్పేందుకు మీరెవరు.?' అన్నట్లుగా కొంచెం గట్టిగానే అందుకుని తర్వాత కాస్త సైలెంట్‌ అయ్యింది. ఆ డ్రస్సులోనే తనకెంతో కంఫర్ట్‌గా ఉంటుందనీ చెప్పింది. అయినా ప్రపంచం చాలా మారింది. ఇలా తన డ్రస్సుపై కామెంట్స్‌ వేసేవాళ్లు కూడా మారాలి.. అని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి బోటమ్‌ వేర్‌లో అస్సలు ఒక్క ఇంచ్‌ కూడా తేడా రాకుండా ఈక్వెల్‌ లెంగ్త్‌ మెయింటైన్‌ చేస్తున్న జాన్వీ డ్రస్సుకి సాహో అనాల్సిందే బాస్‌.

ALSO READ: రష్మికా మండన్నా ఆ తప్పు చేస్తుందా.?