ENGLISH

ఆది సరసన కీర్తిసురేష్‌.!

27 April 2019-17:00 PM

'మహానటి' తర్వాత కీర్తిసురేష్‌ కీర్తి పతాకం ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదిగింది. అయితే ఆ తర్వాత తెలుగులో కొత్త సినిమా సైన్‌ చేయడానికి కీర్తి చాలా టైం తీసుకుంది. ఇటీవల ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీకి సైన్‌ చేసింది. మొన్నా మధ్య ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, తాజాగా ఇంకో సినిమా అనౌన్స్‌ చేసింది కీర్తి సురేష్‌. ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. జగపతిబాబు, రాహుల్‌ రామకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 

నగేష్‌ కుకునూర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నగేష్‌ కుకునూర్‌ అంటే ఆషా మాషీ డైరెక్టర్‌ కాదు. పాపులారిటీ కన్నా, విలక్షణతకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తాడీ వెర్సటైల్‌ డైరెక్టర్‌. సో సక్సెస్‌ని అస్సలు పట్టించుకోడీయన. ఏదో కొత్త విషయాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడమే ఆయన లక్ష్యం. తాజాగా ఈయన కీర్తిసురేష్‌తో తీయబోతున్న సినిమా కూడా అదే కోవకు చెందుతుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌ చిత్రంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారట. 

 

ప్రముఖ నిర్మాత సుధీర్‌ చంద్ర స్టార్ట్‌ చేసిన కొత్త నిర్మాణ సంస్థ వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా రూపొందించబోతున్నారట. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగానే కాకుండా, విలన్‌గా, ప్రత్యేక క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించడానికి ఎక్కువ ఆశక్తి చూపిస్తుంటారు. ఈ సినిమాలో ఆది క్యారెక్టర్‌ చాలా చాలా కొత్తగా ఉండడంతో వెంటనే ఓకే చేశాడట. ఈ ప్రాజెక్ట్‌ అతి త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. 

ALSO READ: నాని, ఇంద్రగంటి - 'వి' ఫర్‌ విక్టరీ.?