ENGLISH

తమిళ హీరో కార్తీ కొత్త సినిమా పోస్టర్‌ ఇదిగో.!

27 April 2019-16:33 PM

తమిళ హీరో కార్తిది ప్రత్యేక శైలి. ఏ క్యారెక్టర్‌లోనైనా ఇమిడిపోగల సత్తా ఉన్న విలక్షణ నటుడు కార్తి. గత కొంత కాలంగా ఎంతో మంది తమిళ హీరోలు తెలుగులో మంచి మార్కెట్‌ ఉన్నా, స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేసే సాహసం చేయలేకపోయారింతవరకూ. కానీ కెరీర్‌ తొలినాళ్లలోనే 'ఊపిరి' అనే తెలుగు సినిమాలో నటించి కార్తి తెలుగు వారి మదిని దోచుకున్నాడు. 

 

ఇటీవల 'దేవ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కార్తి కొత్త సినిమా షురూ చేశాడు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లేటెస్ట్‌గా స్టార్ట్‌ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ప్రకృతిలో మనిషి ముఖం ఆకృతి దాల్చిన వైనం.. ఈ లుక్‌లో కనిపిస్తోంది. డ్రామా బిగిన్స్‌ టుడే.. అంటూ విడుదలైన ఈ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సత్యరాజ్‌ ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్‌ స్టూడియోస్‌లో పేర్లల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్స్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో కార్తికి రియల్‌ లైఫ్‌ వదిన అయిన జ్యోతిక మరో ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నారు. కార్తికి అక్కగా జ్యోతిక నటించబోతోందనీ కోలీవుడ్‌ సమాచారమ్‌. ఇదిలా ఉంటే, కార్తి హీరోగా తెరకెక్కుతోన్న మరో సినిమాతో కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా హీరోయిన్‌గా తమిళ తెరకు పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే.

ALSO READ: 'మన్మధుడు 2'లో నాగ్‌ హై ఓల్టేజ్‌ యాక్షన్‌.!