బెంగుళూర్ రేవ్ పార్టీలో టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. హేమ ఈ రేవ్ పార్టీని నడిపారని, ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు, టెస్ట్ చేయగా పాజిటీవ్ వచ్చిందని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పరప్ప అగ్రహార జైల్లో 14 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఆ తర్వాత బెయిల్ పై హేమ బయటికి వచ్చారు. ఈ నేపథ్యం లోనే 'మా' అసోషియేషన్ కూడా హేమ పై సస్పెన్షన్ విధించింది. తరవాత హేమ తాను ఏ తప్పు చేయలేదని, టెస్ట్ లు చేసుకుని రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయటంతో 'మా' సస్పెన్షన్ ఎత్తేసింది.
మొత్తానికి హేమ కథ సుఖాంతం అయ్యింది అనుకున్నంతలోనే మళ్ళీ కథ మొదటికి వచ్చింది. తాజాగా రేవ్ పార్టీ కేసుపై విచారణ చేపట్టిన బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో 88 మందిని నిందితులుని పోలీసులు పేర్కొన్నారు. అందులో హేమ కూడా ఉండటం గమనార్హం. అంతే కాదు హేమ ఏండీఏంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టును జత చేశారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ ను ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఫైల్ చేసారని సమాచారం. హేమతో పాటు మిగతా 87 మంది మెడికల్ రిపోర్ట్స్ వీటికి జత చేశారని టాక్.
డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీటులో హేమ పేరు రావటంపై స్పందించిన హేమ 'నేను డ్రగ్స్ తీసుకోలేదు. బెంగళూరు పోలీసులు చార్జ్ షీట్‌లో నా పేరు ఎందుకు వేసారో తెలియదు. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. చార్జ్ షీట్ నా వరకు వచ్చాక అప్పుడు దానిపై నేను క్లారిటీ ఇస్తా అని పేర్కొన్నారు. నాకు తెలిసినంత వరకు ఛార్జ్ షీట్ లో డ్రగ్స్ తీసుకోలేదని టెస్ట్ లలో నెగిటివ్ అని వేశారని, కేవలం మీడియా వలనే నా పేరు ఛార్జ్ షీట్ లో పెట్టారని హేమ ఆరోపించింది.