స్టార్ ఎక్కడున్నా స్టారే అన్న మాట మహేష్ ని చూస్తే అర్థమవుతుంది. సినిమాల్లోనే కాదు, బిజినెస్ రంగంలో కూడా మహేష్ సొంత గుర్తింపు తెచ్చుకుని స్టార్ గా వెలుగుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే మహేష్ ని చూస్తే అర్థమవుతుంది. ఒక వైపు సినిమాలు, ఇంకో వైపు యాడ్స్ , మరో వైపు బిజినెస్ లు ఇలా పలు రంగాల్లో నంబర్ వన్ గా దూసుకు పోతూ, సామాజిక సేవలో కూడా ముందుటారు. మహేష్ చేసే సాయం రెండో చేతికి కూడా తెలియనివ్వరు. మహేష్ పిల్లలు కూడా తండ్రి బాటలోనే సాగుతూ పలువురికి అండగా ఉంటున్నారు. టైం దొరికితే ఫ్యామిలీతో గడుపుతూ అందరికి మార్గదర్శకంగా ఉంటాడు మహేష్.
ఇప్పటికే ధియేటర్ బిజినెస్, మాల్స్, రెస్టారెంట్స్, క్లాతింగ్ ఇలా పలు రంగాల్లో రాణిస్తున్న మహేష్ ఇప్పుడు ఇంకో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టారు. అవును కొత్తగా ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. ఫుడ్ అంటే అన్ని రకాలు కాదు కేవలం పోషకాహార ప్రోడక్ట్స్ పై ద్రుష్టి పెట్టారు. ఇందులో భాగంగా 'ఫిట్‌డే' అనే స్టార్టప్ కంపెనీలో మహేశ్ పెట్టుబడి పెట్టారు. ఈ విషయాన్ని ఫిట్ డే కంపెనీ స్వయంగా వెల్లడించింది. ఫిట్ డే హెల్త్ కి సంభంధించిన ఫుడ్, ప్రోటీన్ సప్లై , మిల్లెట్స్ తయారు చేసే కంపెని. మహేశ్ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడని తెలియటంతో అందరిలో ఈ కంపెనీపై, ప్రోడక్ట్స్ పై ఆసక్తి పెరగటం గమనార్హం.