టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' సెప్టెంబర్ 27 న బాక్సాఫీస్ దండయాత్రకు రెడీగా ఉన్నాడు. అప్పుడే ఎక్కడ చూసినా 'దేవర' మానియా కనిపిస్తోంది. ఒక వైపు ఎన్టీఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరో వైపు దేవర పాటలు, ట్రైలర్ వరుసగా రిలీజ్ చేస్తూ మేకర్స్ సర్ప్రయిజ్ ఇస్తున్నారు. ట్రైలర్ తో అంచనాలు పీక్స్ కి చేరాయి. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల్లో ఎన్టీఆర్ నటన వేరే లెవెల్ లో ఉంది. డైలాగ్స్, డాన్స్ అన్ని ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. దేవర మూవీ విశేషాల్ని ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటున్నారు మేకర్స్.
ముంబైలో ప్రమోషన్స్ లో పాల్గొన్న తారక్ షార్క్ ఫైట్ సీక్వెన్స్ గూర్చి మాట్లాడుతూ 'ఆ షార్క్ ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా కష్ట పడినట్లు, రోజంతా పీకల్లోతు నీళ్లలో ఉండి చేయాల్సి వచ్చిందని, దానికోసమే ఎక్కువ సమయం కేటాయించినట్లు పేర్కొన్నారు. 200 ఫీట్ లెన్త్, 100 ఫీట్ విడ్త్ , ఐదున్నర ఫీట్ ఎత్తున్న నీళ్ల ట్యాంక్ లో 38 డేస్ షూటింగ్ చేసినట్లు తెలిపారు. ఆ షార్క్ సీక్వెన్స్ మూవీలో హైలెట్ అవుతాయని కూడా తారక్ తెలిపాడు. సినిమాలోని లాస్ట్ 40 నిమిషాలు సూపర్ ఎగ్జైట్ గా ఉంటుందని తెలిపారు. దేవర రిలీజ్ కు ముందే రికార్డు సృష్టించింది. ప్రీ సేల్స్ టికెట్స్ ద్వారా వన్ మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. రిలీజ్ కి ముందే ఇంత మొత్తం వసూల్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది.
తారక్ ఈ విషయం గూర్చి మాట్లాడుతూ 'దేవుడి ఆశీస్సులు, ఓవర్సీస్ అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఆ రికార్డు సాధ్యమైందని' తెలిపారు. ఇదిలా ఉండగా దేవర మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. యాక్షన్ సీన్స్ లో రక్తపాతం ఎక్కువగా ఉన్నా సెన్సార్స్ కట్స్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవర మూవీ రన్ టైం 2 గంటల 55 నిమిషాలు. అంటే సుమారు మూడు గంటలు. లెంగ్త్ ఎక్కువైనా విసుగు రాకుండా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ ఈ మూవీ తెచ్చి పెడుతుందని మేకర్స్ చెప్తున్నారు.