ENGLISH

మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ రికార్డ్ బ్రేక్‌

11 September 2024-16:37 PM

ఎట్టకేలకు నందమూరి ఫాన్స్ ఎదురుచూసిన సమయం ఆసన్నమయి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమయ్యింది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పక్కా ప్లాన్ చేసిన‌ బాలయ్య వార‌సుడ్ని ప్రశాంత్ వర్మ చేతిలో  పెట్టారు. నందమూరి హీరోలకి అన్ని జోనర్లు వర్కౌట్ అయినా, పౌరాణికాలు బాగా కలిసి వస్తాయి. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో ఇలాంటి మైథిలాజికల్ మూవీ తీయగల సత్తా ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ తో పాన్ ఇండియాలో సత్తా చాటి, ఒక చిన్న హీరోని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టి , నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చి పెట్టాడు. అందుకనే రెండో ఆలోచన లేకుండా మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యతలని ప్రశాంత్ చేతిలో పెట్టేసారు బాలయ్య. 


అంతే కాదు ఈ మూవీకి నిర్మాతగా బాలయ్య రెండో కూతురు తేజస్వి వ్యవహరిస్తుండ‌డం విశేషం. అంటే హీరో, నిర్మాత కూడా ప్రశాంత్ పై నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, మైథిలాజికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని, బాలయ్య కూడా ఈ మూవీలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఖుషి కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన‌ మిగతా డిటైల్స్ త్వరలో ప్రకటించనున్నారు. అభిమన్యుడి క్యారెక్టర్ బేస్ చేసుకొని మోక్షజ్ఞ పాత్ర డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞ యాక్టింగ్, డాన్స్ పరంగా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మంచి హైప్‌ క్రియేట్ చేసింది. 


అయితే ఇప్పుడు మోక్షజ్ఞ రెమ్యునరేషన్ పై నెట్టింట ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి. జనరల్ గా మొదటి సినిమాకి హీరో పేమెంట్ తక్కువే ఉంటుంది. కానీ ఇక్కడ మోక్షజ్ఞ కి ఉన్న క్రేజ్, నందమూరి వారసుడు కావటంతో  మొదటి సినిమాకే రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో వారసుడి డెబ్యూకి ఈ స్థాయి రెమ్యునరేషన్ లేకపోవటం గమనార్హం. ఇప్పటికీ టైర్ 2 హీరోల పేమెంట్ ఈ స్థాయిలో లేదు. మోక్షు ఫస్ట్ మూవీనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా  తెరకెక్కుతోంది. మోక్షజ్ఞ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడని నందమూరి ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.