ENGLISH

గ్లామ్‌షాట్‌: 'ఆడ' దాగున్న హాట్‌ హాట్‌ 'మగాడు' స్టిల్‌ అదరగొట్టాడు.!

14 June 2019-17:30 PM

ఆదాశర్మ రూటే సెపరేటు. ఏం చేసినా ఎక్స్‌పోజింగ్‌ మాత్రం మిస్‌ కాకుండా చూసుకుంటుందీ భామ. తాజాగా ఆదాశర్మ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ పిక్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. సగం అబ్బాయి, సగం అమ్మాయిలా ఉన్న ఈ పిక్‌లో ఆదాశర్మ ఏజ్‌ యూజ్‌వల్‌ హాట్‌ క్లీవేజ్‌ షో చేసి చూపించింది. ఇంతకీ ఇదంతా ఎందుకంటే, ప్రస్తుతం ఆదాశర్మ 'మేన్‌ టు మేన్‌' అనే విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి ఆదా ఈ రకంగా ప్రమోషన్స్‌ చేస్తోంది. అబ్బాయి లక్షణాలున్న అమ్మాయి పాత్రలో ఆదా నటిస్తోంది ఈ సినిమాలో. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పకుండా ఈ సినిమా అందరూ చూడదగ్గ సినిమా అనీ, ఆశక్తికరమైన కథాంశంతో పాటు, సమాజానికి ఉపయోగపడే ఓ మంచి మెసేజ్‌ ఈ సినిమాలో దాగుందనీ చెబుతోంది.

 

ఇక ఈ పిక్‌ విషయానికొస్తే, అందమైన ముఖం కానీ, అబ్బాయిలా మీసాలున్నాయి. అమ్మాయిలా జుట్టుంది. తలపై కిరీటంలా ఉన్న ఓ యాక్సెసరీ.. దాన్ని సరిగ్గా గమనిస్తే అందులో అన్నీ అమ్మాయిల బొమ్మలే ఉన్నాయి. ఇక ఛెస్ట్‌ దగ్గర నుండి అమ్మాయిలా ఉంది. హాట్‌ క్లీవేజ్‌ షో.. అన్నీ వెరసి ఆదాశర్మ ఫోటోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇదే కాదు, ఈ మధ్య ఆదా పోస్ట్‌ చేసిన చాలా స్టిల్స్‌ ఇలాగే, సగం అబ్బాయి, సగం అమ్మాయి లుక్స్‌తో కిర్రాకు పుట్టిస్తున్నాయి.

ALSO READ: ADAH SHARMA AT GR8 WOMEN AWARDS 2014