ENGLISH

‘ఆర్‌ఎక్స్‌ 100’ డైరెక్టర్‌కి హీరో దొరికాడా.?

21 February 2020-07:30 AM

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ అందాల్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఘనత డైరెక్టర్‌ అజయ్‌ భూపతిది. తొలి సినిమాకే సూపర్‌ సక్సెస్‌ అందుకున్నా ఈ డైరెక్టర్‌ రెండో సినిమా అనౌన్స్‌ చేయడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఎప్పటి నుండో ‘మహా సముద్రం’ స్క్రిప్టుపై వర్క్‌ చేస్తున్నాడు అజయ్‌ భూపతి. ఇంతవరకూ ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదు.

 

రవితేజతో ఈ సినిమా చేయాలనుకున్నాడు కుదరలేదు. స్క్రిప్టులో చిన్నా చితకా మార్పులు చేసి, సమంతను సంప్రదించాడట. సమంత కూడా ఈ స్క్రిప్టుకు ఓకే చెప్పకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఇంతవరకూ కార్య రూపం దాల్చలేదు. తాజాగా మరోసారి ఈ సినిమా ముచ్చట తెరపైకి వచ్చింది. యంగ్‌ హీరో శర్వానంద్‌కి డైరెక్టర్‌ ఈ కథను వినిపించాడనీ సమాచారం. శర్వా దాదాపు ఓకే చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా ‘సమ్మోహనం’ భామ అదితీ రావ్‌ హైదరి పేరు వినిపిస్తోంది.

 

ఆల్రెడీ స్టోరీ లైన్‌ విన్న అదితి, ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. అయితే ఇది మల్టీ స్టారర్‌ మూవీ కావడంతో, మరో హీరో కోసం డైరెక్టర్‌ వేట కొనసాగుతోందట. ఆల్రెడీ శర్వా సెట్‌ అయ్యాడని తెలుస్తోంది కాబట్టి, శర్వాని మ్యాచ్‌ చేయగల మరో యంగ్‌ హీరోని వెతికి పట్టుకునే పనిలో ప్రస్తుతం అజయ్‌ భూపతి ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: హీరో.... ఇక జీరో!