ENGLISH

'వివేకం'తో దూసుకొచ్చేస్తున్న అజిత్‌

23 August 2017-12:06 PM

తమిళ హీరో అజిత్‌ నటించిన 'వివేగం' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సక్సెస్‌ల మీద సక్సెస్‌లతో దూసుకుపోతోన్న అజిత్‌, 'వివేగం' సినిమాతో మరో హిట్‌ సొంతం చేసుకోబోతున్నాడని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. తెలుగులో 'వివేకం' పేరుతో ఈ సినిమా విడుదలవుతోంది. హయ్యెస్ట్‌ టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ సినిమాని రూపొందించారు. అజిత్‌ హీరోగా నటించిన 'వీరమ్‌', 'వేదాలమ్‌' సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ శివ దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ రెండు సినిమాలూ ఘనవిజయం సాధించాయి. ఆ కోవలోనే ఈ సినిమా కూడా సంచలన విజయం అందుకుంటుందనే అంచనాలు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో ఉన్నాయి. తమిళంలోనూ, తెలుగులోనూ అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా మలయాళంలో అయితే 300 థియేటర్లకు పైగా ఖాయం చేసుకుందట. ఈ సినిమా కోసం యాక్షన్‌ సీన్స్‌ హాలీవుడ్‌ సినిమాల్ని తలపిస్తున్నాయి. టీజర్‌తోనే మంచి హైప్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ రాకతో ఆ అంచనాల్ని పదింతలకు పెంచుకుంది. వైట్‌ హెయిర్‌తో న్యూ ట్రెండ్‌ సృష్టించాడు అజిత్‌. టీనేజ్‌లో లవర్‌ బోయ్‌లా ఎలా అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టాడో, అదే స్థాయిలో ప్రజెంట్‌ స్టైల్లోనూ లేడీ ఫ్యాన్స్‌ని మెస్మరైజ్‌ చేస్తున్నాడు అజిత్‌. దానికి తోడు పక్కా మాస్‌ ఇమేజ్‌ అజిత్‌ సొంతం. కాజల్‌ అగర్వాల్‌, అక్షరా హాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ALSO READ: మళ్ళీ పెళ్ళి చేసుకోనున్న నటి