ENGLISH

‘రొమాంటిక్‌’ హగ్గింగ్‌: సముద్రమంత ప్రేమ.!

14 February 2020-10:01 AM

లవర్స్‌డేకి ‘రొమాంటిక్‌’ టీమ్‌ ఓ లవ్‌లీ గ్లాన్స్‌ రిలీజ్‌ చేసింది. ఏముందా.? అని ఉత్కంఠగా ఆ గ్లాన్స్‌ క్లిక్‌ చేస్తే ఇంకేముంటుంది. ఓ గాఢమైన కౌగిలి. అయితే, ఈ కౌగిలికి మరింత గాఢత పెంచేలా బ్యాక్‌ గ్రౌండ్‌ సముద్రాన్ని ఎంచుకున్నారు. రొమాంటిక్‌ ఈవినింగ్‌లో సముద్రమే వీరి కౌగిలికి వేదికైంది. కాస్తయినా గాలి చొరబడకుండా, కాస్సేపు ఊపిరి కూడా బంధీ అయిపోయిందా.? అన్నట్లు చాలా ఘాటుగా మునిగిపోయిన కౌగిలి ఇది. పూరీ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా, కేతికా శర్మ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ ‘రొమాంటిక్‌’ చిత్రానికి డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్‌ పాడూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పూరీ కనెక్స్ట్‌ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌, ఛార్మి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

టైటిల్‌కి తగ్గట్లుగానే పక్కా రొమాంటిక్‌ యాంగిల్‌లో సినిమా ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. మే 29న ‘రొమాంటిక్‌’ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. చాలా రోజుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ ఫిలిం నుండి మరిన్ని రొమాంటిక్‌ యాంగిల్స్‌ వదుతారో ఏమో కానీ, లవర్స్‌ డేకి లవర్స్‌ అందరిలోనూ జోష్‌ నింపేలా ఉంది ఈ గ్లాన్స్‌. తన ప్రియమైన తనయుడికి ఈ సినిమా ద్వారా ఎలాగైనా హిట్‌ కట్టబెట్టానుకుంటున్నాడు పూరీ జగన్నాధ్‌. అందుకేనేమో ఏమాత్రం మొహమాటపడకుండా, కొడుకుతో ఎలాంటి రొమాంటిక్‌ సీన్స్‌ చేయిస్తున్నాడో.. అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నా, లెక్క చేయకుండా కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. చూడాలి, ‘రొమాంటిక్‌’తో పూరీ తన కోరిక తీర్చుకుంటాడో లేదో.!

ALSO READ: బాలీవుడ్‌లోనూ ‘అల..లు సృష్టిస్తుందా?