పాపం అఖిల్. తనకేం కలసి రావడం లేదు. ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. తన ఆశలన్నీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`పైనే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా కూడా ముక్కుతూ, మూలుగుతూ ముందుకు కదులుతోంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా, ఇప్పటి వరకూ బయటకు రాలేదు. విడుదల తేదీలు మార్చుకుంటూ వస్తోంది చిత్రబృందం. ఓటీటీ కి బేరం కుదిరిపోయిందనుకున్నారు. అయితే అఖిల్ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాల్సివస్తోంది. పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు దసరాకు రెడీ అవుతోందట.
దసరా మంచి సీజనే. ఇంటిల్లిపాదీ థియేటర్లకు వచ్చే తరుణం. అయితే.. ఈ దసరా కి బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ ఉండబోతోంది. చిరంజీవి - ఆచార్య, బాలకృష్ణ - అఖండలు దసరాకే రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ఇంకొన్ని సినిమాలూ వచ్చే అవకాశం ఉంది. వీటి మధ్య అఖిల్ కచ్చితంగా నలిగిపోతాడు. సినిమా బాగున్నా - దానికి తగిన వసూళ్లు అందుకునే ఛాన్సులు తక్కువ. ఖర్మకాలి.. ఫ్లాప్ టాక్ వస్తే - ఇక నిలబడడం అసాధ్యం. ఈ తరుణంలో అఖిల్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. కాకపోతే.. నిర్మాతలకు మరో మార్గం లేదాయె.
ALSO READ: ఈవారం ముక్కోణపు పోటీ