ENGLISH

వెన‌క‌డుగు వేసిన అఖిల్‌

04 February 2021-09:30 AM

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ... అఖిల్ క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి. అస‌లే... హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్న ఈ యంగ్ హీరో... ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. త‌న కంగారుకి త‌గ్గ‌ట్టే... ఈ సినిమా వాయిదా ప‌డుతూ ప‌డుతూ వ‌స్తోంది. సంక్రాంతికి ఈ సినిమా వ‌స్తుంద‌ని ఆశించారు. ఆ త‌ర‌వాత మార్చి కి వాయిదా ప‌డింది. మే 21న సినిమా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించింది. ఇప్పుడు బ్యాచిల‌ర్ మ‌రోసారి వెన‌క‌డుగు వేశాడు.

 

జూన్ 19న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. పూజా హెగ్డే క‌థానాయిక‌. ఈ సినిమా పూర్త‌యినా.. మ‌ధ్య‌లో చిన్న చిన్న రిపేర్లు జ‌రుగుతున్నాయి. మే నాటికి సినిమా పూర్త‌వుతుంది. అయితే... మేలో పెద్ద‌హీరోల సినిమాలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. 13న ఆచార్య‌, 14న నార‌ప్ప‌, 28న బాల‌కృష్ణ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో.. త‌న సినిమా ఇరుక్కుపోవ‌డం అఖిల్ కి ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు జూన్ 19కి వాయిదా ప‌డింది.

ALSO READ: సోలో బ‌తుకే.. ఫైన‌ల్ రిపోర్ట్ ఏమిటి?