ENGLISH

Akkineni Family: అక్కినేని కుటుంబం బాధ పడింది

25 January 2023-10:07 AM

‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వేడుకలో చాలా అసందర్భమైన మాటలు ఆడారు బాలకృష్ణ. సినిమాతో సంబంధం లేని అనేక టాపిక్ లు తీసుకొచ్చారు. అందులో వివాదానికి దారి తీసింది ‘’ఆ రంగా రావు.. అక్కినేని.. తొక్కనేని వ్యాఖ్య. ఒక టాపిక్ గురించి చెబుతూ బాలయ్య చాలా క్యాజువల్ గా ఈ మాట అనేశారు. ఈ మాటే వివాదానికి తీసింది.

 

కాగా, తాజాగా ఈ వివాదం పై అక్కినేని కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌.వి రంగారావు గారు.. వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడమంటే మనల్ని మనమే కించపరుచుకోవడం..’’ అని నాగచైతన్య, అఖిల్‌ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

బాలయ్య మాటలు అక్కినేని కుటుంబాన్ని బాధపెట్టయని ఈ ప్రకటన చూస్తే అర్ధమౌతుంది. నిన్నటి వరకూ సోషల్ మీడియాలోనే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు అక్కినేని కుటుంబం కూడా స్పందించింది. మరి బాలయ్య ఈ వివాదంపై వివరణ ఇస్తారో లేదో చూడాలి.