ENGLISH

రాజమౌళి హత్యకు కుట్ర ?!

24 January 2023-18:00 PM

రామ్ గోపాల్ వర్మ ప్రతి ట్వీట్ లో ఎదో ఒక వివాదం, సంచలనం వుంటుంది. ఇప్పుడు ఆయన నుండి మరో సంచలనమైన ట్వీట్ వచ్చింది. దర్శకుడు రాజమౌళిని చంపడానికి కుట్ర జరుగుతుందని ఓ ట్వీట్ పెట్టాడు వర్మ. రాజమౌళి క్రేజ్ పేరిగిపోతున్న నేపథ్యంలో పలువురు భారతీయ దర్శకులు ఈర్ష్యతో రగిలిపోతున్నారని, ఆయన్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పుకొచ్చారు.

 

“‘మొఘల్ ఈ ఆజాం’ తీసిన కా ఆసిఫ్ నుంచి మొదలుకొని.. ‘షోలే’ తీసిన రమేష్‌ సిప్పీ వరకు అందరినీ నువ్వు అధిగమించావు. ఆదిత్య చోప్రాలు, కరణ్‌ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావు. “రాజమౌళి సర్, దయచేసి మీరు సెక్యూరిటీ పెంచుకోండి. ఫిల్మ్ మేకర్స్ అంతా మీ మీద ద్వేషంతో రగిలిపోతోన్నారు. వారంతా మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. కానీ, నాకు నాలుగు రౌండ్లు పడే సరికి ఇలా చెప్పేశాను” అని చెప్పుకొచ్చారు వరమా. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి.