ENGLISH

పవన్‌ రిస్క్‌ చేశాడు, అక్షయ్‌కుమార్‌ చేస్తాడా?

01 September 2017-16:39 PM

అజిత్‌ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'వీరమ్‌'ని హిందీలో చేయాలనుకుంటున్నాడట అక్షయ్‌కుమార్‌. ఇది నిజమే అయితే షాకింగ్‌ న్యూస్‌గా పరిగణించాలి. ఎందుకంటే 'వీరమ్‌' సినిమా తెలుగు వెర్షన్‌ థియేటర్లలో విడుదల కాకపోయినా, టీవీల్లో మార్మోగిపోయింది. 'వీరుడొక్కడే' పేరుతో తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా బాగా అలవాటైపోయింది. అయినప్పటికీ కూడా దాన్ని తెలుగులోకి 'కాటమరాయుడు'గా రీమేక్‌ చేసిన పవన్‌, నెగెటివ్‌ ఫలితాన్ని చవి చూశాడు. 'వీరమ్‌' హిందీలోకీ డబ్‌ అయ్యింది. అక్కడా థియేటర్లలో కాకుండా, టీవీల్లో ప్రదర్శితమయ్యింది ఆ సినిమా. ఎప్పుడంటే అప్పుడు 'వీరమ్‌' హిందీ డబ్బింగ్‌ సినిమా టీవీల్లో కనిపిస్తుంటుంది. అలాంటి సినిమాని రీమేక్‌ చేయడమంటే చేతులు కాల్చుకోవడమే. కాబట్టి, అక్షయ్‌కుమార్‌ అంతలా రిస్క్‌ చేయకపోవచ్చు, పవన్‌ చేసినట్లు. తెలుగులో 'కాటమరాయుడు' సినిమాలో పవన్‌ సరసన శృతిహాసన్‌ నటించింది. తెలుగులో తెరకెక్కిన 'కాటమరాయుడు'లో చాలా వరకూ సీన్స్‌ మక్కీకి మక్కీ 'వీరమ్‌' నుండి దించేసినట్లే ఉన్నాయి. కానీ పవన్‌ నుండి కొంచెం కొత్తగా ఆలోచించిన అబిమానులకు ఆ రకంగా నిరాశ ఎదురయ్యింది. దాంతో టోటల్‌గా సినిమా ఫెయిలైంది. కానీ హిందీలో అక్షయ్‌ ఏం చేస్తాడో మరి. అసలే యాక్షన్‌ హీరో కాబట్టి, యాక్షన్‌ సీన్స్‌ని ఇంకా బాగా రీమేక్‌ చేస్తాడేమో. అలాగే లవ్‌ సీన్స్‌, సెంటిమెంట్‌ సీన్స్‌ ఇతరత్రా అంశాల్ని ఆక్షయ్‌ తన సినిమాలో కొంచెం ఎక్స్‌ట్రాగా చూపిస్తాడేమో చూడాలిక.

ALSO READ: పైసా వ‌సూల్‌ రివ్యూ & రేటింగ్స్