ENGLISH

'ఎఫ్‌ 2'తో బాలీవుడ్‌లోకి దిల్‌రాజు.!

29 March 2019-14:30 PM

రాజుగారు.. అదేనండీ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ మన దిల్‌రాజు గారు త్వరలో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అభిరుచి గల సినిమాలను రూపొందించి, టాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌ ప్రొడ్యూసర్స్‌లో ఒకరిగా ఉన్న దిల్‌రాజు బాలీవుడ్‌లోనూ సత్తా చాటనున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'ఎఫ్‌ 2'తో బంపర్‌ హిట్‌ కొట్టిన దిల్‌రాజు త్వరలో 'మహర్షి'తో మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌కి రెడీ అవుతున్నారు. అసలు మ్యాటరేంటంటే, తాజాగా 'ఎఫ్‌ 2' సినిమాని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

 

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి దిల్‌రాజు 'ఎఫ్‌ 2'ని రీమేక్‌ చేయబోతున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన ఈ సినిమాకి అనీస్‌ బజ్మీ హిందీలో దర్శకత్వం వహిస్తున్నారు. 'ముబారకన్‌', 'వెల్‌కమ్‌ బ్యాక్‌', 'రెడీ' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనీస్‌ 'ఎఫ్‌ 2' రీమేక్‌పై ఆల్రెడీ కసరత్తులు స్టార్ట్‌ చేశారట. బాలీవుడ్‌ నేటివిటీకి సంబంధించి చిన్నా చితకా మార్పులు చేయనున్నారట. 

 

తెలుగులో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ వంటి స్టార్‌ హీరోలతో రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్‌లో ఏ స్టార్‌ హీరోలు రంగంలోకి దిగనున్నారో ఇంకా వివరాలు తెలియరాలేదు. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా కుప్పలు తెప్పలుగా మల్టీ స్టారర్లు తెరకెక్కుతుంటాయి బాలీవుడ్‌లో. అలాంటిది ఆల్రెడీ సక్సెస్‌ మూవీ అనిపించుకున్న 'ఎఫ్‌ 2' రీమేక్‌ కోసం ఏ స్టార్‌లు పోటీ పడనున్నారో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.! 

 

ALSO READ: మహర్షి': 'సింగిల్‌'గా అంచనాలు పెంచేశాడు.!