ENGLISH

అల్లరికి 'హైపర్‌ తోడైతే ఆ కిక్కే వేరప్పా

31 August 2017-16:18 PM

అల్లరోడు త్వరలోనే 'మేడ మీద అబ్బాయి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకప్పుడు అల్లరి నరేష్‌ సినిమాలంటే మినిమమ్‌ గ్యారంటీ సినిమాలు. నిర్మాతలకి కాసుల పంట, ఆడియన్స్‌కి నవ్వుల పంట. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్‌ మారిపోయాయి. అల్లరోడి నవ్వులు ఇప్పుడు బోర్‌ కొట్టేశాయి. స్పూఫ్‌లు చేయడంలో అల్లరి నరేష్‌ దిట్ట. తనదైన స్టైల్‌లో స్పూఫ్‌లు చేసి, కామెడీ పండించేవాడు. అయితే ఇప్పుడు కామెడీలో కొత్తదనం కోరుకుంటున్నారు ప్రేక్షకులు. ఆ రకంగా నరేష్‌ కామెడీని ఆదరించలేకపోతున్నారు ఆడియన్స్‌. దాంతో నరేష్‌ ఏం పట్టుకున్నా ఫెయిల్‌ అవుతూ వస్తోంది. 'సుడిగాడు' వరకూ నరేష్‌ సుడి బాగానే ఉంది. ఆ తర్వాత నుండీ రివర్స్‌ అయిపోయింది. కొంచెం కొత్తగా ఉంటుంది కదా అని హారర్‌ కామెడీని కూడా ట్రై చేశాడు 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమాతో అల్లరి నరేష్‌. కానీ అది కూడా నరేష్‌కి సక్సెస్‌ తెచ్చి పెట్టలేదు. ఈ సారి 'మేడ మీద అబ్బాయి' అంటూ వస్తున్నాడు. ఈ సినిమాకి ఈ టీవీ 'జబర్దస్త్‌' ఫేం హైపర్‌ ఆది డైలాగ్స్‌ అందించాడు. 'జబర్దస్త్‌' ప్రోగ్రాంలో ఆది డైలాగ్స్‌కి సూపర్‌ ఫాలోయింగ్‌ ఉంది. గుక్క తిప్పుకోకుండా ఆది వేసే పంచ్‌ డైలాగ్స్‌కి పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. కొంచెం కూడా గ్యాప్‌ ఇవ్వకుండా, టైమింగ్‌ మిస్‌ కాకుండా ఆది వేసే పంచ్‌ డైలాగ్స్‌కి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. సో ఆది డైలాగుల్తో 'మేడ మీద అబ్బాయి' నవ్వులు పూయిస్తుందేమో. ఈ సినిమాతో అయినా నరేష్‌ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి మరి.

ALSO READ: బాలకృష్ణ పైసా వసూల్ స్టొరీ లీక్?