ENGLISH

ఉప్పెన హీరోకు రెండోది ఫిక్స్!

07 August 2020-10:38 AM

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ త్వరలో 'ఉప్పెన' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ కరోనా క్రైసిస్ కారణంగా వాయిదా పడింది.  థియేటర్లు తెరిచిన తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కూడా ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. ఈసారి వైష్ణవ్ తేజ్ సినిమాను అల్లు అరవింద్ గారు నిర్మించేందుకు రెడీ అవుతున్నారట. జీఎ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ సినిమాతో ఓ నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయిందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రానుందని సమాచారం.


మొదటి సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమా ఖరారయింది అంటే గొప్ప విషయమే అని చెప్పుకోవాలి. మరి మొదటి సినిమా 'ఉప్పెన' తో వైష్ణవ్ ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

ALSO READ: ప‌రుచూరి ఇంట్లో విషాదం