ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య పరుచూరి విజయలక్ష్మి (74)ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. విజయలక్ష్మి మృతి సంగతి తెలియనగానే.. టాలీవుడ్ ప్రముఖులు వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు.
చిరంజీవి సైతం.. విషయం తెలియగానే పరుచూరి వెంకటేశ్వరావు కి ఫోన్ చేసి తన విచారం వ్యక్తం చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు తన ఆత్మీయుడని, కుటుంబ సభ్యుడితో సమానమని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ALSO READ: కోలుకుంటున్న ఫృథ్వీరాజ్.