ఆగస్టు 22... చిరు ఇంట్లో కోలాహలం మామూలుగా లేదు. ఓ వైపు చిరంజీవి పుట్టిన రోజు. మరో వైపు.. రాఖీ. ఈ రెండు పండగలూ.. అత్యంత వైభవంగా జరిగాయి. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అరవింద్, నాగబాబు ఇలా ముఖ్యమైన వాళ్లంతా.. ఈ వేడుకలో కనిపించారు. అయితే బన్నీ మాత్రం మిస్సయ్యాడు. ఈ వేడుకకు అల్లు అర్జున్ రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీ ఎందుకురాలేదు? మెగా కుటుంబానికీ, బన్నీకీ ఏమైనా గ్యాప్ వచ్చిందా? అంటూ ఆరాలు మొదలైపోయాయి.
ఏ చిన్న విషయం జరిగినా, సోషల్ మీడియా దాన్ని చిలవలు, పలవలుగా మార్చేస్తోంది. ఇదీ అంతే. పుట్టిన రోజు వేడుకకు రాకపోయినంత మాత్రాన.. వాళ్ల మధ్య గ్యాప్ వచ్చినట్టు కాదు. చిరుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. బన్నీ ఓ ట్వీట్ చేశాడు. తన చిన్ననాటి ఫొటో పంచుకున్నాడు. నిజానికి ఈ వేడుకకు బన్నీ రావాల్సిందే. కానీ.. `పుష్ష` షూటింగ్ వల్ల వీలు కాలేదు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తను ఈమధ్యే సెట్లోకి వచ్చాడు. తనతో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించాల్సివచ్చింది. అందుకే ఆ సినిమా సెట్లో బన్నీ బిజీగా ఉన్నాడు. అందువల్లే.. చిరు ఇంటికి రాలేకపోయాడు. అదీ.. మేటరు.
ALSO READ: అన్నీ ఓకే చిరు... కానీ మెహర్ రమేష్ అంటేనే..!