ENGLISH

బన్నీ- సుకుమార్ బాండింగ్ ఇంత గొప్పదా?

03 December 2024-13:10 PM

పుష్ప 2 రిలీజ్ కి ఇంకా రెండు రోజులున్న సందర్భంగా హైదరాబాద్ లో అదిరిపోయే ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. పాట్నా, చెన్నై , కొచ్చి, ముంబాయి తరవాత హైద్రాబాద్ లో కూడా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎంత సరదాగా సాగిందో ఈవెంట్ అంతే ఎమోషనల్ గా కూడా ఉంది. టీమ్ మొత్తం ఎమోషనల్ అయ్యారు. బన్నీ, రష్మిక, సుకుమార్, ఆయన భార్య తబిత అంతా పుష్ప, పుష్ప 2 జర్నీ తలచుకుని ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతుండగా బన్నీ కంటతడి పెట్టడం, చిన్నపిల్లాడిలా ఏడవటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సుకుమార్ స్టేజ్ పై బన్నీ గూర్చి మాట్లాడుతూ 'బన్నీని ఆర్య మూవీ టైం నుంచి చూస్తున్నాను. తాను ఎదిగే తీరు ఒక వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా చూసాను. పుష్ప సినిమా ఇంత పెద్ద హిట్ అందుకోవటానికి కారణం బన్నీ అని, మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కూడా అని తెలిపారు సుకుమార్. బన్నీ ఒక సీన్ కోసమో, ఒక సాంగ్ కోసమో కాకుండా కేవలం ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా చాలా కష్టపడతాడు అని తెలిపారు సుకుమార్. కేవలం బన్నీ పై ప్రేమతోనే పుష్ప తీశానని, తనకి ఈ సినిమా గూర్చి చెప్పేటప్పుడు కనీసం తన దగ్గర  కథ, స్క్రిప్ట్ ఏమీ లేవని, తాను కేవలం హీరో క్యారక్టర్ గురించి, కొన్ని సీన్స్ చెప్పానని, బన్నీ తనపై ఉన్న నమ్మకంతో పుష్ప ఒప్పుకున్నాడని చెప్తూ, లవ్ యు బన్నీ అని ఎమోషనల్ గా చెప్పటంతో బన్నీ కూడా ఏడ్చేశాడు.

ALSO READ: అప్పుడే రెండో సినిమా లైన్ లో పెట్టిన మోక్షజ్ఞ