బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ అప్పుడే స్పీడ్ పెంచాడు. మొదటి సినిమా మొదలు పెట్టకముందే మంచి క్రేజ్ తెచ్చుకుని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమా యూనివర్స్ కి తగ్గా మేకోవర్ తో చార్మింగ్ గా ఉన్నాడు. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబో మూవీ డిసెంబరు5 న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఓపెనింగ్ తరువాత రెగ్యులర్ గా సినిమా షూటింగ్ ఉంటుంది అని టాక్. ఓపెనింగ్ రోజే మిగతా నటీ నటులు, టెక్నీషియన్స్ ఎవరన్నది అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.
మోక్షజ్ఞ మొదటి సినిమా ఇంకా ప్రారంభం కాకముందే ఇంకో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు ముగిసాయాని, మోక్షజ్ఞ నెక్స్ట్ మూవీకి సైన్ చేసేసినట్లు తెలుస్తోంది. లక్కీ భాస్కర్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ సెకండ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. బాలయ్యతో 'డాకు మహారాజు' నిర్మించిన సితార ఎంటర్టైన్ మెంట్ ఇప్పుడు మోక్షజ్ఞ మూవీకి కూడా రెడీ అవుతోంది.
ప్రశాంత్ మూవీ కంప్లీట్ అయ్యాక మోక్షజ్ఞ ఈ ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తారా ? లేదా రెండు ఒకే టైం లో చేస్తారా అన్నది చూడాలి. సీనియర్ హీరోలు ఏళ్లతరబడి ఒకే సినిమాకోసం వర్క్ చేస్తుంటే, ఈ కొత్త హీరో మాత్రం ఒకేసారి రెండు సినిమాలు చేస్తాడా ? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా బాలయ్య వారసుడు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ: మంచు ఫ్యామిలీ కాంబోలో మనోజ్, లక్ష్మి మిస్?