ENGLISH

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ షూటింగ్ ముచ్చట్లు

26 August 2017-19:19 PM

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ లు జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.  కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో   యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.  “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” చిత్ర షూటింగ్ రామెజిఫిల్మ్ సిటి లో ప్ర‌ముఖ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ రామ్ - ల‌క్ష‌ణ్ ల సార‌ద్యంలో యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.  ఈ సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు.  బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.   

ఈ సంద‌ర్బంగా నిర్మాత శిరీషా శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ప్ర‌స్తుతం రామెజి ఫిల్మ్ సిటిలో జ‌రుగుతుంది.  ప్ర‌ముఖ ఫైట్ మాస్ట‌ర్స్ రామ్- ల‌క్ష‌ణ్ లు ఆద్వ‌ర్యంలో యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.  అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణుల‌తో చిత్రాన్ని ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రీక‌రిస్తున్నాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.

- ప్రెస్ రిలీజ్

 

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్