ENGLISH

నందమూరి క్యాంపు లో మిల్కీ బ్యూటీ

26 August 2017-19:17 PM

ఇటు కోలీవుడ్ అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయిన తమన్నా బాహుబలి తరువాత ఒక తెలుగు చిత్రం చేయడానికి ఒప్పుకుంది.

వివరాల్లోకి వెళితే, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘180’ మూవీ ఫేం జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో తమన్నాహీరోయిన్ గా ఎంపిక అయింది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో నటించిన తమన్నా, ఇప్పుడు ఆయన అన్న అయిన కళ్యాణ్ రామ్ తో నటించనుండడం విశేషం.

ప్రస్తుతం, కళ్యాణ్ రామ్ ‘యం.ఎల్‌.ఎ’ అనే చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

 

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్