ENGLISH

మంత్రిగారికి 'మంచు'వారమ్మాయ్‌ ఓపెన్ లెటర్

26 August 2017-19:15 PM

మంచు లక్ష్మి.. మోహన్ బాబు కూతురిగానే కాకుండా నటిగా, నిర్మాతగా, యాంకర్ గా, పలురంగాలలో తన ఉనికిని చాటుకుంది.

ఇక ఈరోజు ఆమె హైదరాబాద్ లోని ఒక సమస్య పైన మంత్రి కేటీఆర్ కి బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఉత్తరంలో ఆమె హైదరాబాద్ లో గణేష్ మండపాల పేరిట రోడ్ల పైన గుంటలు తవ్వి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడం, బ్యానర్లు కట్టడం వంటివి చేయడం వల్ల ఆ రోడ్లు పాడయిపోతుండడం. అలానే విగ్రహాల నిమ్మజన సందర్భంలో అడ్డు వచ్చిన తీగలను తెంపేయడం జరుగుతుంది, అలా చేసాక వాటిని తిరిగి మరమ్మతులు చేసే పని ఎవరు తీసుకుంటారు?

ముఖ్యమైన అంశంగా ఆ ఉత్తరంలో గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో కూడా ఆలోచన చేయాలి అని ఆమె సూచించారు. ఇక వాడ వాడకి గణేష్ మండపాలు పెట్టనీయకుండా ఒక ఏరియాకి ఒక మండపం ఉండేలా చూడమని ఆమె ఒక సలహా కూడా ఇచ్చారు.

మరి దీనిపైన మంత్రి ఇంకా స్పందించలేదు.

 

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్