ENGLISH

అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి అల్లు అర్జున్ ఫోన్?!

28 August 2017-18:51 PM

అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమా చేయడానికి అందరు హీరోలు ఆసక్తి చూపుతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో! ఇటువంటి తరుణంలో ఆయనకీ స్టైలిష్ స్టార్ నుండి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, అర్జున్ రెడ్డి చిత్రం గురించి విన్న బన్నీ వెంటనే ఆ చిత్ర దర్శకుడైన సందీప్ కి ఫోన్ చేసి అభినందించాడట! అలానే త్వరలోనే ఒక చిత్రం చేద్దాము అంటూ కూడా తన మనసులోని మాటని భయట పెట్టినట్టు తెలుస్తున్నది!

ఇక ఒక ఇంటర్వ్యూ లో భాగంగా అర్జున్ రెడ్డి కథకి అల్లు అర్జున్ ని సూట్ అయ్యేవాడని తన మనసులో మాట చెప్పాడు. దీనితో వీరి కలయికలో ఒక సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది అని వార్తాలు షికారు చేస్తున్నాయి.

 

ALSO READ: మహేష్ కత్తికి బండ్ల గణేష్ వార్నింగ్