ENGLISH

Mahabharatham: రూ.2500 కోట్లతో ‘మహాభారతం’

13 September 2022-11:00 AM

‘మహాభారతం’ ప్రాజెక్ట్‌ సిద్ధం చేయనున్నట్లు టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ గతంలో ఓసారి వెల్లడించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నిర్మాత మధు మంతెనతో కలసి ఈ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది. మహాభారతాన్ని సినిమాలా కాకుండా వెబ్‌సిరీస్‌ రూపంలో నిర్మించనున్నారు. డిస్నీప్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా దీన్ని విడుదల చేయనున్నారు.

 

అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైధోవర్స్ స్టూడియోస్ సంయుక్తంగా దీన్ని రూపొందిస్తున్నాయి. దాదాపు 2500 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో విజువల్ వండర్ గా ఈ సిరీస్ ను నిర్మించనున్నారని టాక్. తెలుగు హిందీ ఇంగ్లీష్ లతో పాటుగా పలు ఇతర ప్రధాన భారతీయ భాషల్లో ఈ సిరీస్ ని రూపొందించనున్నారట. స్టార్ క్యాస్టింగ్ - అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని తెలుస్తోంది.

ALSO READ: Pushpa 2: పుష్ప 2 సాయి పల్లవి.. నిజమేనా ?