ENGLISH

Valtheru Veerayya: వాల్తేర్ వీరయ్యలో నారప్ప !

13 September 2022-10:00 AM

మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ఈ చిత్రానికి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ లో పోషిస్తున్నారు.

 

ఈ చిత్రానికి సంబధించిన కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఈ సినిమా క్లైమాక్స్ లో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నారుట. గెస్ట్ అప్పీరియన్స్ రోల్ కి వెంకీని ఒప్పించినట్లు సమాచారం. ఈ పాత్రని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట బాబీ. ఇదే నిజమైతే మెగా 154లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ చేరిపోయినట్లే.

 

అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసనశృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు, ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: Pushpa 2: పుష్ప 2 సాయి పల్లవి.. నిజమేనా ?