ENGLISH

తమ్ముడ్ని హీరోని చేస్తున్న హీరోయిన్‌

15 March 2017-16:57 PM

ముద్దుగుమ్మ అమలా పాల్‌ ఈ మధ్యనే భర్త నుండి విడాకులు తీసుకుని సినిమాల్లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం కన్నడ సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో కూడా పలు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఆమె తమ్ముడు అభిజిత్‌ పాల్‌ కూడా నటుడే. ఇప్పటికే పలు సినిమాల్లో అభిజిత్‌ నటించాడు. అయితే ఇప్పుడీ అభిజిత్‌ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారమ్‌. ఇదొక ప్రయోగాత్మక చిత్రమని తెలియవస్తోంది. ఈ చిత్ర నిర్మాణంలో అమలాపాల్‌ భాగం పంచుకుంటోందని సమాచారమ్‌. అమలాపాల్‌ తెలుగులో 'బెజవాడ', 'నాయక్‌' తదితర సినిమాల్లో నటించింది. పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఈ డస్కీ బ్యూటీ. ఈ సినిమాతో తన తమ్ముడు కూడా మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తోందట. అలాగే తనకున్న ఫాలోయింగ్‌తో తన తమ్ముడికి కూడా మంచి పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమాకి ఎక్కడ మంచి ఆదరణ దక్కుతుందో అక్కడ తన తమ్ముడు పూర్తి స్థాయి హీరోగా పాపులర్‌ కాగలడనీ భావిస్తోందట. అంటే తనలాగే ఆమె తమ్ముడు కూడా మంచి టాలెంటెడ్‌ అని చెప్పుకొస్తోంది అమలాపాల్‌. ఏది ఏమైనా తమ్ముడ్ని హీరోగా పరిచయం చేయడమే కాకుండా అతని ప్రమోషన్‌ కోసం అమలాపాల్‌ పడుతున్న శ్రమ గొప్పదే.

ALSO READ: కమల్‌హాసన్‌ అలా చేస్తాడా?