ENGLISH

Amigos: జై ల‌వ‌కుశ‌కు ఇది మ‌రో వెర్ష‌నా..?

13 December 2022-09:39 AM

'బింబిసార‌'తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు క‌ల్యాణ్ రామ్‌. ఇప్పుడు మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న `అమిగోస్‌`లో న‌టిస్తున్నాడు. రాజేంద‌ర్ రెడ్డి ఈచిత్రానికి ద‌ర్శ‌కుడు. అమిగోస్ అంటే.. ఫ్రెండ్స్ అని అర్థం. ఈ చిత్రానికీ.. ఎన్టీఆర్ `జై ల‌వ‌కుశ‌` క‌థ‌కీ కొన్ని ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయి.

 

'జై ల‌వ‌కుశ‌'లో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేశాడు. అమిగోస్‌లో కూడా క‌ల్యాణ్ రామ్ ది త్రిపుల్ రోల్. జై ల‌వ‌కుశ‌లో ముగ్గురు ఎన్టీఆర్‌లు ఉంటే, ఇద్ద‌రివి పాజిటీవ్ పాత్రలు. ఒక‌టి నెగిటీవ్ పాత్ర‌. సేమ్ టూ సేమ్‌.. అమిగోస్ లో కూడా అంతే. ఓ క‌ల్యాణ్ రామ్ ఈ సినిమాలో విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఒకేలా ఉండే ముగ్గురి క‌థ ఇది. ఆ ముగ్గురూ ఎలా క‌లిశారు? క‌లిశాక ఏం జ‌రిగింది? అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఓ యాప్ చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంద‌ని, అలాంటి పాయింట్ ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ యాప్ ఏమిటో? ఈ ముగ్గురి క‌థేమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: Ram Charan: మెగాన్యూస్ : తండ్రి కాబోతున్న రామ్ చరణ్