ENGLISH

Ram Charan: మెగాన్యూస్ : తండ్రి కాబోతున్న రామ్ చరణ్

12 December 2022-14:49 PM

మెగా ఫ్యాన్స్‌కు మెగా న్యూస్. త్వరలోనే రామ్‌చరణ్‌ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్-ఉపాసన దంపతులు మొదటి బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం నెలకొంది.

 

2012 జూన్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తర్వాత బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో మెగా ఇంట సంబురాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ చిత్రంలో నటిస్తుండగా చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.