ENGLISH

'సైరా' బిగ్‌బీకి ప్రత్యేకం.!

11 October 2018-13:35 PM

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు సందర్భంగా 'సైరా' టీమ్‌ ఆయనకు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్‌ తెలిపింది. అమితాబ్‌ బచ్చన్‌ పోస్టర్‌తో పాటు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ సెట్స్‌లో ఉన్న స్టిల్స్‌తో కూడిన మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది. ఆల్రెడీ సుదీప్‌ గెటప్‌ని గతంలోనే విడుదల చేశారు. 

తాజాగా విడుదలైన విజయ్‌ సేతుపతి గెటప్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ ఇద్దరూ పోరాట యోధుల్లా కనిపించబోతున్నారీ సినిమాలో. ఇకపోతే అమితాబ్‌ పాత్ర ఈ సినిమాకి అత్యంత కీలకమైన పాత్ర. నరసింహారెడ్డిని తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడిగా తీర్చి దిద్దే పాత్ర ఆయనది. ఆయన పాత్ర పేరు గోశాయి వెంకన్న. నరసింహారెడ్డికి గురువు పాత్ర అది. గురువు హోదాలో నరసింహారెడ్డికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నట్లుగా ఉన్న స్టిల్స్‌ని గతంలోనే విడుదల చేశారు. ఆ స్టిల్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

ఇలా అమితాబ్‌ పాత్ర సినిమా అంతా చాలా కీలకంగా కనిపిస్తుందట. ప్రస్తుతం జార్జియాలో 'సైరా' చిత్ర షూటింగ్‌ జరుగుతోంది. భారీ ఖర్చుతో కూడుకున్న భారీ షెడ్యూల్‌ ఇది. షూటింగ్‌ కోసం అక్కడ ఓ నగరాన్ని సెట్‌గా వేసేశారట. సినిమాకి అత్యంత కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌నీ, కీలక సన్నివేశాల్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు. 

ఈ షెడ్యూల్‌ కోసం దాదాపు 50 కోట్లు బడ్జెట్‌ వ్యత్యిస్తున్నట్లు సమాచారమ్‌. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ALSO READ: ఎన్టీఆర్‌ 'అరవింద'కు విజయ్‌ రౌడీస్‌ దెబ్బ.!