ENGLISH

బిగ్ బి కి అస్వస్థత... క్లారిటీ

16 March 2024-12:53 PM

బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిన్న అస్వస్థతకు గురవటంతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. కాగా కొందరు శ్వాస సంబంధ సమస్య వలన  బిగ్ బి  హాస్పటల్లో చేరినట్టు ప్రచారం చేశారు. కానీ కాలికి సంబంధించిన సమస్య కారణంగా అమితాబ్ ఆసుపత్రిలో చేరినట్టు, సమాచారం.  అమితాబ్ కు కరోనరీ హార్ట్ కాకుండా పెరిఫెరల్ హార్ట్ కు చికిత్స అందిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా న్యూస్ కథనాలు వెలువరించింది.  యాంజియోప్లాస్టీని ఆయన గుండెకు కాకుండా కాలులో గడ్డకట్టిన భాగానికి నిర్వహించినట్లు తెలుస్తోంది.


అమితాబ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తన ప్రాజెక్ట్స్,హెల్త్ కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటారు. బిగ్ బి హాస్పటల్లో చేరే ముందు ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. 4,950 నంబర్ తో చేసిన ఆ పోస్ట్ లో " కళ్ళు తెరుచుకుని చూడండి, మీ చెవులతో వినండి, మాజీ  ముంబై విజయం సాధిస్తుంది. దీన్ని మీరు అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది" అని తన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ జట్టు ముంబై ప్రమోషనల్ వీడియోను షేర్ చేశారు. మార్చి 14న ఐఎస్ పీఎల్ మ్యాచ్ లో చెన్నై సింగమ్స్ పై మాజీ ముంబై 58 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలి ISPL - టీ10 లీగ్ లో బచ్చన్ సేన ఫైనల్ కు చేరింది. ఇదే విషయాన్ని అమితాబ్ షేర్ చేసారు. 


చెడు కొలెస్ట్రాల్ లేదా రక్తం గడ్డకట్టడం వల్ల గుండె ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు యాంజియోప్లాస్టీ సర్జరీ జరుగుతుంది. కాలిలో రక్తం గడ్డ కట్టడం వల్ల అమితాబ్ కి ఈ  సర్జరీ చేసినట్టు,  ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగా ఉందని  వైద్యులు వెల్లడించారు. అమితాబ్ కూడా  తరవాత తన ఫాన్స్ కి  శ్రేయోభిలాషులకు ట్వీట్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.