ENGLISH

మహేష్ విలన్ హృతిక్!?

18 March 2024-11:56 AM

మహేష్ రాజమౌళి కాంబోలో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో రానున్న మొదటి సినిమా ఇదే కావటం ఒక ఎత్తు అయితే, రాజ మౌళి తన కథకి మహేష్ ని ఎంచుకోవటం ఇంకొక కారణం. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ దగ్గరనుంచి రోజు కొక న్యూస్ చక్కర్లుకొడుతోంది. జక్కన్న సినిమా అనగానే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సారి ఎలాంటి వండర్ క్రియేట్ చేయనున్నాడో  అని. టాలీవుడ్ లో  విజువ‌ల్ ట్రీట్ తో అద్భుతాలు చేసే జక్కన్న, హాలీవుడ్ స్థాయికి చేరుకున్నాడు. జేమ్స్ కామరూన్ లాంటి వ్యక్తి మన దర్శకధీరుడు పై ప్రశంసలు కురిపించాడు అంటేనే తెలుస్తోంది జక్కన పనితనం.


తన మూవీలో అద్భుతమైన కాంబినేష‌న్స్ చూపించే రాజమౌళి  మహేష్ తో చేయబోయే సినిమాకి కూడా ఇలానే ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోంది.  ఇపుడు ఇందులో విలన్ క్యారక్టర్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జక్కన్న సెట్ చేసిన ఈ కాంబినేషన్ పై సినీ వర్గాలు ఔరా అంటున్నారు.
     

మ‌హేష్ – రాజ‌మౌళి కాంబో మూవీలో బాలీవుడ్ గ్రీక్ వీరుడు  'హృతిక్ రోష‌న్' కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.  ఏంటి మహేష్ హృతిక్ మల్టీ స్టారర్ అనుకుంటున్నారా? హృతిక్ హీరోగా కాదు విలన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ సినిమాలో ఓ బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడి పాత్ర సృష్టించిన జక్కన్న ఎవ‌రైతే బాగుంటార‌న్న విష‌యంపై చాలా చర్చలు జరిపినట్టు, లాస్ట్ కి హృతిక్ రోష‌న్ కి ఓటు వేసినట్టు సమాచారం. ఇదే గనక నిజమైతే సినీప్రియులకి మంచి ట్రీట్ దొరికినట్టే. మహేష్ కి విలన్ గా హృతిక్ రోషన్ నటిస్తే ఫాన్స్ ఒక టికెట్ పై రెండు సినిమాలు చూసినట్టే.