ENGLISH

బిగ్ బీ.. బాలకృష్ణని కాదని చిరుకి ఎందుకు ఓకే అన్నాడో తెలుసా?

23 August 2017-19:45 PM

బాలకృష్ణ రైతు చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు అంటూ కొన్ని నెలల క్రింద వార్తలు వచ్చాయి. తరువాత కాలంలో అవి కేవలం వార్తలు గానే మిగిలిపోయాయి.

ఇక విషయానికి వస్తే, చిరంజీవి 151వ చిత్రంలో అమితాబ్ నటిస్తుండగా మళ్ళీ బాలకృష్ణ సినిమాలో అమితాబ్ ఎందుకు నటించలేదు అన్న వార్తాలు మొదలయ్యాయి. అయితే దీనికి కారణాలు ఇవే అంటూ కొన్ని ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి.

అందులో కొన్ని-

-    చిరంజీవి మళ్ళీ నటించడం మొదలుపెడితే, తాను ఒక అతిధి పాత్ర చేస్తాను అంటూ కొన్ని సంవత్సరాల క్రింద మాట ఇవ్వడం.

-    సైరా చిత్రంలో హీరోకి గురువు పాత్ర అవ్వడంతో అలాగే ఆ పాత్ర చాలా ముఖ్యమైనది అవ్వడంతో ఆయన ఈ పాత్రకి ఒప్పుకున్నారు అని.

-    బాలకృష్ణ రైతు చిత్రానికి సంబందించిన బౌండ్ స్క్రిప్ట్ లేకపోవడం వల్లనే ఆ చిత్రంలో పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు అని ఇంకొక వార్త చక్కర్లు కొడుతున్నది.

ఈ పై వార్తల్లో ఎంత నిజం ఉన్నది అన్న విషయం పైన స్పష్టత లేకపోయినప్పటికీ ఇప్పుడు బిగ్ బీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది.

 

ALSO READ: జైలవకుశ ఆడియో విడుదలకి ముహూర్తం ఫిక్స్