ENGLISH

షాకింగ్‌: ప్రాజెక్ట్ కె సెట్లో ప్ర‌మాదం... గాయాల‌పాలైన అమితాబ్‌

06 March 2023-09:49 AM

ప్ర‌ముఖ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ గాయాల‌పాల‌య్యారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ లో భాగంగా కొన్ని యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు అమితాబ్ కు దెబ్బ‌లు త‌గిలాయి. ఆయ‌న్ని హుటాహుటిన హైద‌రాబాద్ లోని ఏఎంజీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర‌వాత‌... వైద్యుల సూచ‌న మేర‌కు ముంబై తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం బిగ్ బి క్షేమంగానే ఉన్నారు. త‌న ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకొంటున్నారు. ఈ విష‌యాన్ని బిగ్ బీ స్వ‌యంగా వెల్ల‌డించారు.

 

ప్రాజెక్ట్ కె షూటింగ్ లో తాను గాయ‌ప‌డ్డాన‌ని, ప‌క్క‌టెములకు దెబ్బ త‌గిలింద‌ని, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉంద‌ని అమితాబ్ త‌న బ్లాగ్ లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం త‌న నివాసంలో విశ్రాంతి తీసుకొంటున్న‌ట్టు, గాయం కార‌ణంగా అభిమానుల్ని క‌ల‌వ‌లేక‌పోతున్నాన‌ని, షూటింగులు కూడా ర‌ద్దు చేసుకొన్నాని తెలిపారు అమితాబ్‌. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ప్రాజెక్ట్ కెలో అమితాబ్ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ షెడ్యూల్ మొద‌లైంది. అందులో భాగంగానే యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించిన‌ట్టు స‌మాచారం