ENGLISH

అందాల అమైరా ఆఫర్లు భళా.!

01 June 2018-12:47 PM

'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన బ్యూటీ అమైరా దస్తూర్‌. లేటెస్టుగా 'రాజుగాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్యూట్‌ అప్పీల్‌తో పాటు, గ్లామర్‌ డోస్‌ కూడా ఎక్కువే ఈ బ్యూటీకి. అయితే ఇప్పుడిప్పుడే తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మకి సరైన ఓ భారీ ఆఫర్‌ పడితే, సత్తా చూపిస్తానంటోంది.

ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో దూకుడు మీదుంది అమైరా దస్తూర్‌. శర్వానంద్‌ హీరోగా వచ్చిన 'ప్రస్థానం' హిందీ రీమేక్‌లో అమైరా హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు, విభిన్న కథా చిత్రాల దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడి హిందీలో తెరకెక్కిస్తోన్న చిత్రంలోనూ అమైరా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన రెండు సినిమాలకూ లేడీ డైరెక్టర్సే దర్శకత్వం వహించడం విశేషం.

మగవారితో సమానంగా ఆడవాళ్లు  దేనిలోనూ తీసిపోరు అన్నదానికి తాను నటించిన దర్శకురాళ్లే ప్రత్యక్ష సాక్ష్యం అంటోంది అమైరా దస్తూర్‌. అయితే అంచనాల మీద వచ్చిన 'మనసుకు నచ్చింది' సినిమా కమర్షియల్‌గా ఆశించిన రిజల్ట్‌ అందుకోకపోయినా, ఆహ్లాదాన్ని ఇష్టపడే వారి మనసును గెలుచుకుంది. ఇప్పుడు 'రాజుగాడు' చిత్రంలో ఈ బ్యూటీ క్యూట్‌నెస్‌, హాట్‌నెస్‌తో పాటు, కామెడీ యాంగిల్‌ కూడా చూపించిందట.

ఫస్ట్‌ హాఫ్‌లో గ్లామర్‌ డోస్‌ బాగా చూపించిందట. ప్రోమోస్‌లో కూడా అమైరా హాట్‌ హాట్‌ క్లిప్పింగ్స్‌ యూత్‌ని ధియేటర్స్‌కి రప్పించేలా చేస్తాయనడం నిస్సందేహం అనిపిస్తోంది. చిలిపి దొంగతనం అనే ఓ లోపంతో హీరో క్యారెక్టర్‌ని డిజైన్‌ చేసిన లేడీ డైరెక్టర్‌ సంజనా రెడ్డి, ఈ సినిమాతో ఎంత మేర విజయం సాధిస్తుందో చూడాలి మరి.

మరీ భారీ అంచనాలు కాకపోయినా, ఓ మేర అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాజుగాడు' సినిమా ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!

ALSO READ: 'ఆఫీసర్‌' రిపోర్టింగ్‌ అదుర్స్‌