ENGLISH

గ్లామ్‌షాట్‌: అదిరేటి డ్రస్సు నువ్వేస్తే, అది అమైరా.!

01 May 2019-12:17 PM

ఆహా.. ఏమి నీ స్టైలింగ్‌! అనేలా ఉందీ పిక్‌. స్టైలింగ్‌లో కెవ్వుకేక అమైరా. ఇందులో ఎంత మాత్రమూ సందేహం లేదు. ఇక ఈ ఫోటో తీసిన కెమెరామేన్‌ చేతిలో కూడా ఏదో మ్యాజిక్‌ ఉంది. చాలా లైవ్‌గా మనసును ఎక్కడో టచ్‌ చేస్తోంది ఈ పిక్‌. కైపెక్కించే గ్లామర్‌ కాసేపు పక్కన పెడితే, ఈ బ్లాక్‌ మోడ్రన్‌ కాస్ట్యూమ్‌లో అమైరా స్టైల్‌ మత్తెక్కించేస్తోందంతే. సైడ్‌ వ్యూలో అమైరా స్టిల్‌ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోంది.

 

ఇకపోతే సినిమాల విషయానికి వస్తే, 'మనసుకు నచ్చింది' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాలో అమైరాని చూసిన వాళ్లంతా స్టార్‌డమ్‌ దక్కించుకునే ఛాన్స్‌ ఈ బ్యూటీకి హండ్రెడ్‌ పర్సంట్‌ ఉందని నమ్మకం వ్యక్తం చేశారు. కానీ అది జరగలేదు. తొలి సినిమాతో పాటు, తర్వాత వచ్చిన 'రాజుగాడు' సినిమా కూడా బెడిసికొట్టింది. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ప్రస్తుతం ఓ మోస్తరు అవకాశాలతో బిజీగా ఉంది. సినిమాల్లో అవకాశాలు ఎలా ఉన్నా, ఫిట్‌నెస్‌, వర్కవుట్స్‌ అంటూ ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ పోజుల్లో ఫోటో సెషన్స్‌ చేయించుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఆ ఫోటోలతోనే కిర్రాక్‌ ఫాలోయింగ్‌ సంపాదించింది అందాల అమైరా దస్తూర్‌.

ALSO READ: TEJASWI GALLERY