ENGLISH

అనసూయ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ

01 September 2017-16:33 PM

సోషల్‌ మీడియాలో అనసూయ హాట్‌ టాపిక్‌ అవుతోంది. వివిధ అంశాలపై అనసూయ నిక్కచ్చి అభిప్రాయాలు చెబుతోంటే, వాటిని కొంతమంది నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణంగా ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్‌గా వార్తల్లో ఉండాలనుకుంటూ ఉంటుంది. ప్రధానంగా అనసూయ వస్త్రధారణపై విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం. కానీ అనసూయ తన యాటిట్యూడ్‌ అంటూ గ్లామరస్‌ యాంగిల్‌ని వెనకేసుకొస్తోంది. ఇంకో వైపున అనసూయ వయసు గురించి కూడా సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి చర్చ సెలబ్రిటీలకు ఇబ్బందికరమే. అందులోనూ అనసూయలాంటి సెలబ్రిటీస్‌కీ మరీను. అందుకనే కొందరు సెలబ్రిటీలు సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటారు. ఓ సంచలన వ్యాఖ్య చేయగానే దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా అదే స్థాయిలో చర్చ జరగడం సోషల్‌ మీడియాకే చెల్లుతోంది. ఇటువంటి సందర్భాల్లోనే సోషల్‌ మీడియా మంచిదా? కాదా? అనే అనుమానం కూడా కలుగుతుంటుంది. ఏదేమైనా సోషల్‌ మీడియాలో అనసూయ హాట్‌ టాపిక్‌ అవుతుండడం వల్ల ఆమె పాపులారిటీ మరింత పెరుగుతోంది, అలాగే కొంత వ్యతిరేకత కూడా లభిస్తున్నప్పటికీ ఆది ఆమెకి ప్లస్సే అవుతుందని చెప్పొచ్చు. ఈ రకంగా అనసూయకి ఫ్రీగా పబ్లిసిటీ దొరుకుతున్నట్లే కూడా. సినిమాల్లో ఏ అవకాశం వచ్చినా వదులుకోనంటోన్న అనసూయకి చిన్న చిన్న అవకాశాలేం కాదు, మెగా మెగా అవకాశాలే వస్తుండడం విశేషం. 'విన్నర్‌'లో సాయి ధరమ్‌తో చిందేసిన హాట్‌ బ్యూటీ ఇప్పుడు చరణ్‌తో 'రంగస్థలమ్‌'లో నటిస్తోంది.

ALSO READ: పైసా వ‌సూల్‌ రివ్యూ & రేటింగ్స్